Leading News Portal in Telugu

Saim Ayub Shot: సయీమ్‌ ఆయుబ్‌ వీరవిహారం.. ఈ సిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్


Saim Ayub Shot: సయీమ్‌ ఆయుబ్‌ వీరవిహారం.. ఈ సిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్

Pakistan Opener Saim Ayub Six Video Goes Viral: పాకిస్తాన్‌ యువ ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌ వీరవిహారం చేశాడు. 8 బంతుల్లో ఏకంగా 5 బౌండరీలతో 27 రన్స్ బాదాడు. ఇందులో మూడు సిక్సులు ఉండగా.. రెండు ఫోర్లు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో సయీమ్‌ ఆయుబ్‌ విరుచుకుపడ్డాడు. అయితే ఫైన్ లెగ్‌లో బాదిన ఓ సిక్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాట్ హెన్రీ వేసిన రెండో ఓవర్ ఐదవ బంతిని ఆయుబ్‌ ఫైన్ లెగ్‌ దిశగా భారీ సిక్సర్ బాదాడు. షాట్ కొట్టిన అనంతరం వికెట్ల కంటే ఎక్కువ ఎత్తులో కాలు లేపినా.. చక్కగా బ్యాలెన్స్ చేశాడు.


227 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం దక్కింది. సయీమ్‌ ఆయుబ్‌ ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే అనూహ్యంగా ఆయుబ్‌ రనౌట్ అవ్వడంతో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. మహ్మద్ రిజ్వాన్ (25), ఫఖర్ జమాన్ (15) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో బాబర్ ఆజమ్ (30), ఇఫ్తికార్ అహ్మద్ (17) ఉన్నారు. పాక్ విజయానికి 58 బంతుల్లో 108 రన్స్ అవసరం. బాబర్, ఇఫ్తికార్ ధాటిగా ఆడుతున్నారు. సౌథీ, సోది తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు డారిల్‌ మిచెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కివీస్‌ భారీ స్కోర్‌ చేసింది. న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఫిన్‌ అలెన్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్‌ చాప్‌మన్‌ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీతో (57) రాణించాడు. షాహీన్‌ అఫ్రిది (4-0-46-3), ఆమిర్‌ జమాల్‌ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.