Leading News Portal in Telugu

Denmark Queen Margrethe: సింహాసనాన్ని వదులుకున్న డెన్మార్క్‌ క్వీన్.. కొత్త రాజుగా ఫ్రెడెరిక్-10


Denmark Queen Margrethe: సింహాసనాన్ని వదులుకున్న డెన్మార్క్‌ క్వీన్.. కొత్త రాజుగా ఫ్రెడెరిక్-10

Denmark Queen Margrethe: డెన్మార్క్‌ రాణి మార్గరెట్-2 సింహాసనం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లోని క్రిస్టియన్ బోర్గ్‌ ప్యాలెస్‌లో సంబంధిత దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. అనంతరం ఆమె పెద్దకుమారుడు ఫ్రెడెరిక్-10ను రాజుగా ప్రకటించారు. డెన్మార్క్ రాణి మార్గరెట్ II దేశ 900 సంవత్సరాల చరిత్రలో తన కుమారుడు, యువరాజుకు అనుకూలంగా సింహాసనాన్ని వదులుకున్న మొదటి రాణిగా చరిత్రలో నిలిచిపోయారు. తన 52 ఏళ్ల పాలనలో, మార్గరెట్ తాను సింహాసనాన్ని వదులుకోనని ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. కానీ శస్త్రచికిత్సలు, ఇతర అనారోగ్యాల కారణంగా ఆమె తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోయింది. క్రిస్టియన్స్‌బోర్గ్ ప్యాలెస్ బాల్కనీలో ఫ్రెడరిక్‌ను డెన్మార్క్ కొత్త రాజుగా ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడరిక్‌సెన్ ప్రకటించారు.


సమయం చాలా పవర్ ఫుల్ అని చెబుతూ నూతన సంవత్సర ప్రసంగంలో తన పదవి నుంచి వైదొలగబోతున్నట్లు ప్రకటించారు డెన్మార్క్‌ రాణి. డెన్మార్క్‌లో అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కానీ, రాచరిక వ్యవస్థ ఉండటంతో రాజు లేదా రాణి సామ్రాజ్యాధినేతగా ఉంటారు. క్వీన్ మార్గరెత్ తన పదవీ విరమణ పత్రంలో 50 సంవత్సరాలకు పైగా సంతకం చేసింది. దీంతో దేశానికి కొత్త రాజు, కొత్త వారసుడు కూడా దొరికాడు. ఇక నుంచి ఆయన డెన్మార్క్‌ రాజుగా, గ్రీన్‌ల్యాండ్‌, ఫారోయి దీవులకు దేశాధినేతగా ఫ్రెడెరిక్-10 ఉండనున్నారు. ఆయన భార్య మేరీ రాణిగా, పెద్ద కుమారుడు క్రిస్టియన్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, రాజ వారసుడిగా మారారు. మార్గరెట్‌-IIకు ‘రాణి’ బిరుదు అలాగే కొనసాగనుంది.