Leading News Portal in Telugu

విషమంగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల | cpm leader tammineni health condition critical| heart| attack| kidney| lungs| problem| aig| hospital| health


posted on Jan 17, 2024 8:39AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని  ఆరోగ్యం విషమంగా ఉంది. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా తమ్మినేని వీరభద్రం మంగళవారం (జనవరి 16) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.

ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.  తమ్మినేని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ,  నిపుణులైన వైద్యులపర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.