Leading News Portal in Telugu

Currency: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలు ఏవో తెలుసా?


Currency: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలు ఏవో తెలుసా?

ఆరోజుల్లో డబ్బులు తెలియవు.. రెక్కాడితే కానీ డొక్కాడవు.. అలాంటిది ఇప్పుడు కరెన్సీ విలువ పెరిగిపోయింది.. ఒక్కో దేశానికీ ఒక్కో రకమైన కరెన్సీ నోట్లు ఉంటాయి.. దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.. కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు..


ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను విడుదల చేసింది. వీటి ప్రాముఖ్యతకు దోహదం చేసే కారణాలను వివరించింది. 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు పేర్కొంది. మొదటి ప్లేస్ లో కువైట్ దినార్ ఉందని తెలుస్తుంది.. మరి భారత దేశం ఎన్నో స్థానంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

*. మొదటి స్థానంలో కువైట్ దినార్ ఉంది.. ఒక కువైట్ దినార్ మన కరెన్సీలో రూ. 270.23 (3.25 డాలర్లు)లకు సమానం.
*.రెండో స్థానంలో బహ్రెయిన్ దినార్ ఉంది. దీని విలువ భారత కరెన్సీలో రూ. 220.4 (2.65 డాలర్లు)..
*.మూడో స్థానంలో ఒమానీ రియాల్ (రూ. 215.84 , 2.60 డాలర్లు)..
*.జోర్డానియన్ దినార్ (రూ. 117.10, 1.141 డాలర్లు),
*.జిబ్రాల్టర్ పౌండ్ (రూ. 105.52 , 1.27 డాలర్లు),
*. బ్రిటిష్ పౌండ్ (రూ. 105.54, $1.27 డాలర్లు),
*.కేమన్‌ దీవుల డాలర్‌ (రూ.99.76 , 1.20 డాలర్లు )
*. స్విస్ ఫ్రాంక్ (రూ. 97.54 , 1.17 డాలర్లు)
*. యూరో (రూ. 90.80 ,1.09డాలర్లు).
*.అమెరికా డాలర్ (రూ. 83.10)

ఆ దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం వల్ల ఆ దేశ కరెన్సీకి విలువ ఎక్కువ.. అలా చూసుకుంటే కువైట్ దినార్ కు విలువ ఎక్కువగా ఉంది.. చివరగా అమెరికా ఉంది..