
Usman Khawaja survives Injury from Shamar Joseph Bouncer: ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు పెను ప్రమాదం తప్పింది. అడిలైడ్ టెస్ట్‌లో మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖవాజా గాయపడ్డాడు. వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకగానే బ్యాట్ కింద పడేసిన ఖవాజా.. నొప్పితో విలవిలలాడాడు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో.. ఖవాజాకు కంకషన్ టెస్ట్ చేశాడు. అంతా బాగుండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ రెండో బంతికే జరిగింది.
బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పడంతో ఉస్మాన్ ఖవాజాను రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటించారు. మైదానం వీడుతున్న సమయంలో అతడి నోట్లోంచి రక్తం వచ్చింది. ఆస్ట్రేలియా వైద్య బృందం వెంటనే స్కానింగ్ చేయగా.. దవడ ఎముక విరిగిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే కంకషన్ లక్షణాలు ఏమైనా కనిపిస్తాయేమో అనే ఉద్దేశంతో ఖవాజాను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. జనవరి 25 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బాలో రెండో టెస్టు ఆరంభంకానుంది. ఆలోపు ఖవాజా కోలుకుంటాడా? లేదా? చూడాలి.
A nasty moment as Usman Khawaja is hit on the chin by a Shamar Joseph short ball #AUSvWI pic.twitter.com/nF5nFqxgJJ
— cricket.com.au (@cricketcomau) January 19, 2024