Leading News Portal in Telugu

Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..


Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..

Snoring: బిగ్గరగా “గురక” పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి.


62 ఏళ్ల రాబర్ట్ వాలెస్, క్రిస్టోఫర్ కేసీ(55) ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్నారు. అయితే వాలెస్ గురకపై పలుమార్లు కేసీ ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఈ వివాదంపై ఇరువురి మధ్య తీవ్రవివాదం చోటు చేసుకుంది. జనవరి 15న కేసీ, వాలెస్‌ని కత్తితో పొడిచాడు. కత్తిపోట్లకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు స్పందించారు. అప్పర్ మోర్‌ల్యాండ్ టౌన్‌షిప్‌లో కేసీ ఇంటి సమీపంలో వాలెస్ తీవ్రగాయాలతో కనిపించాడు. దాడి చేస్తున్న సమయంలో కేసీకి కూడా గాయాలయ్యాయి. వీరిద్దర్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స సమయంలోనే వాలెస్ మరణించాడు. జనవరి 18న కేసీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంటి ముందు కత్తి, రక్తపు మరకల్ని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ వాలెస్ మరణానికి కారణం అనేక కత్తిపోట్లు అని నిర్ధారించిన తర్వాత, కేసీని గురువారం అరెస్టు చేశారు.