Leading News Portal in Telugu

Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?


Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో జీ2 పేరుతో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పాటుగా 256జీబీ వరకు ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. వివో హ్యాండ్‌సెట్‌లో 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ అందించే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది.. ఆండ్రాయిడ్ 13పై ఆధారపడిన ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 89.67 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే.. 13ఎంపీ వెనుక కెమెరాతో, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎఫ్/2.8 ఎపర్చరుతో వీడియో కాల్‌లు, సెల్ఫీలను తీసుకోవచ్చు.. అలాగే బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.. ఇక ధర విషయానికొస్తే.. జీ2 ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ ధర సీఎన్‌వై 1,199 (సుమారు రూ. 14వేలు)గా నిర్ణయించింది. మీరు స్మార్ట్‌ఫోన్‌ను వరుసగా సీఎన్‌వై 1,499 (సుమారు రూ. 17,500), సీఎన్‌వై 1,599 ( సుమారు రూ. 18,700) ధరతో 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అత్యంత ఖరీదైన కాన్ఫిగరేషన్ ధర సీఎన్‌వై 1,899 (సుమారు రూ. 22వేలు) ఉంటుంది..