
డ్రై ఫ్రూట్స్ లలో వాల్ నట్స్ కూడా ఒకటి.. వాల్ నట్స్ చూడడానికి మెదడు ఆకారంలో ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి.. వీటిలో శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి.. రోజు ఒక గుప్పెడు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.. అలాగే మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది.. మెదడు చురుగ్గా పని చేస్తుంది.. కణాల ఆరోగ్యం బాగా ఉంటుంది.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ కణాలు దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. అలాగే బరువును అదుపులో ఉంచడంలో కూడా వాల్ నట్స్ మనకు సహాయపడతాయి..
వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.. అంతేకాదు వీటిలో యాంటీఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.. వృద్ధాప్య ఛాయాలు రాకుండా ఉంటాయి.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు..