Leading News Portal in Telugu

Jai Shri Ram on Eiffel Tower: ఈఫిల్ టవర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలు..


Jai Shri Ram on Eiffel Tower: ఈఫిల్ టవర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలు..

అయోధ్యలో రామ మందిరలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుండగా ఈ చారిత్రాత్మక సందర్భంగా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామ నామ జపం కొనసాగుతుంది. తాజాగా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.


ఇక, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇలాంటి స్పందనలు వస్తున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విదేశాల్లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన వారు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, శ్రీ రాముడు తన నగరమైన అయోధ్యలోకి వచ్చిన తర్వాత తన భక్తులకు త్వరలో దర్శనమిస్తారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాంలాలా విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.