
ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా కంపెనీ ప్రకటించింది.. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఫోల్డబుల్ ఫోన్లో విభిన్నమైన డిస్ ప్లే ఉంటుంది. దీని బయటవైపు స్క్రీన్ 6.43 అంగుళాలతో 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందిస్తుంది. ఎల్టీపీఓ కవర్ స్క్రీన్ తో తో శక్తివంతమైన విజువల్స్ ను అందిస్తుంది.. స్క్రీన్ రక్షణ కోసం నానో క్రిస్టల్ గ్లాస్ ప్రోటెక్షన్ 7.92 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానల్ ను కలిగి ఉంటుంది.. సెల్ఫీ ప్రియులకు పండగే..ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది..
ధర విషయానికొస్తే.. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 16జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా 5000ఎంఏహెచ్ ఉంటుంది. ఇది డ్యూయల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. యూరోప్ లో దీని దర 1,699.99యూరోలుగా నిర్ణయించారు.. మన కరెన్సీలో రూ. 1,53,507.56గా ఉంటుంది. ఇది బ్లాక్ వేగన్ లెదర్, ఫాంటమ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.. వచ్చే నెల 2 నుంచి మార్కెట్ లో సేల్స్ ప్రారంభం కానున్నాయి..