Leading News Portal in Telugu

కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే.. బీజేపీ | bjp alligation on congress| action| on dharani| somesh| wife| land

posted on Jan 31, 2024 10:32PM

అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఎలా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిందో.. ఆ అధికారం నుంచి వైదొలగిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. అధికారులను చెప్పు చేతల్లో ఉంచుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలు, అడ్డగోలు కబ్జాలతో చెలరేగిపోతే… కేసీఆర్ సర్కార్ కు సన్నిహితంగా మెలిగిన అధికారులు కూడా అందిన కాడకి దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిలోనే వ్యవహరించారని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంలోబయటపడుతున్న భూ కొనుగోలు దందా తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ చర్యలు తీసుకోవడానికి ముందు వెనుకలాడుతోందంటూ విరుచుకుపడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిస్తుంటే.. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలోనే   గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరుమీద పాతిక  ఎకరాలు రిజిస్ట్రేషన్  ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేసు నమోదు చేసే విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో చెప్పాలని బీజేపీ నాయకుడు రఘునందనరావు రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు. 

అలాగే ఎన్నికల ముదు అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామంటూ పదేపదే చెప్పిన రేవంత్ అధికారం చేపట్టి రెండు నెలలు అయినా ధరణిలో సవరణలు అంటూ ఎందుకు మాటమారుస్తున్నారని విమర్శిస్తున్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారుగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి.. సర్వీస్ లో ఉండగా  ధరణిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదని నిలదీస్తున్నారు.  పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదని రఘునందనరావు ప్రశ్నించారు.

మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత కూడా బీజేపీతో అంటకాగుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు విమర్శలూ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రివర్స్ లో బీజేపీ తాను రెండు పార్టీలకూ వ్యతిరేకమనీ, ఆ రెండు పార్టీలే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనీ ఎదురు విమర్శలకు దిగుతోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు  బీజేపీ బలపడేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ప్రచారం చేసి లబ్ధిం పొదాలని చూస్తోంది.