Leading News Portal in Telugu

Paytm: ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పని చేస్తుంది..


Paytm: ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పని చేస్తుంది..

గత కొద్దీ రోజులుగా పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. తమ కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తున్నందున పేమెంట్స్‌ బ్యాంక్ కాదన్నారు. దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు సపోర్టు ఉందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ చర్యపై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను ఇవ్వలేదన్నారు.


అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన ఆంక్షల వల్ల పేటీఎం షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. ఒక్కో షేరు ధర 20 శాతం వరకు క్షీణించి ఎన్‌ఎస్‌ఈలో ఆరు వారాల కనిష్టానికి పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్‌ 1.2 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయింది. 2021 నుంచి కంపెనీ ఫార్మ్‌ లోకి వచ్చిన తర్వాత అత్యంత చెత్త ట్రేడింగ్‌ ను నిన్న (గురువారం) నమోదు అయ్యాయి.

కంపెనీలో సీఈఓ విజయ్ శేఖర్ శర్మ 19. 4 శాతం వాటా ఉంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో 51 శాతం వాటాను హోల్డ్‌ చేస్తున్నారు. ఇక, గురువారం నాడు స్టాక్‌ మార్కెట్లో షేర్లు దారుణంగా పడిపోవడంతో ఆయన సంపద 233 మిలియన్‌ డాలర్ల మేర క్షీణించింది. ఈ కంపెనీని 20 సంవత్సరాల ముందు శర్మ స్టార్ట్ చేశారు. దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన స్టార్టప్‌ కంపెనీ పేటీఎం. 2016 నవంబర్‌ లో మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరుణంలో పేటీఎం చాలా వేగంగా మార్కెట్లో నిలిచింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో పేటీఎం కొత్త ఒరవడిని సృష్టించింది.