posted on Feb 2, 2024 11:17AM
ఎపికి మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎపికి రాజధాని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జై అమరావతి ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై ఏపీ మంత్రి రోజాకు శ్రీవారి సేవకుల నుంచే నిరసన సెగ తగిలింది. జై అమరావతి అంటూ వారు మంత్రి ఎదుట నినదించారు. అంతకుముందు వారు మంత్రి రోజాతో సెల్ఫీలు దిగారు. ఎపికి మూడు రాజధానులు అవసరం లేదని వాళ్లు మంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్లు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత… అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె ఆందోళనకారులతో నవ్వుతూ సమాధానాన్ని దాట వేసారు. జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు. అయితే, రోజా చిరునవ్వులు చిందిస్తూనే… ‘శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది?’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎపిలో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో అమరావతి ఉద్యమకారుల నుంచి నిరసన రావడం జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది