Leading News Portal in Telugu

రేరా బాలకృష్ణుడు నోరు విప్పితే ఫామ్ హౌజ్ లో ప్రకంపనలే


posted on Feb 2, 2024 1:25PM

అవినీతి అన‌కొండ… అదేనండి హెచ్ఎండిఏ బాలకృష్ణ, పెద్ద సార్‌ భార్య‌కి 25 ఎక‌రాల భూమి గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చాడు. ధ‌ర‌ణిని అడ్డుపెట్టుకొని తెలంగాణా వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూముల రికార్డులు తారుమారు చేసిన‌ స్కాంలో ప్ర‌ధాన సూత్రదారి ఎవ‌రు?అత‌న్నే అప్ప‌ట్టి సి.ఎం. త‌న సలహాదారుగా పెట్టుకొవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి?

కోకాపేట భూముల విక్ర‌య వ్య‌వ‌హ‌రంలో మైహోమ్, రాజ‌పుష్ప కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి వెయ్యి కోట్ల స్కామ్ కు తెర‌లేపిన బీహార్ బ్యాచ్ పై తెలుగువ‌న్ గ్రౌండ్ రిపోర్ట్‌.తెలంగాణా లో బీహార్ బ్యాచ్  చేసిన ఆరాచ‌కాలు ఒక్కొక్క‌టి వెలుగుచూస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గుర్తున్నారా.. అదే నండి….ఆయన్ను ఏపీకి కేటాయిస్తే తెలంగాణలోనే ఉండి సీఎస్ గా పని చేశారు. 

ఏపీ క్యాడర్ వెళ్లాలని తేల్చిచెప్పడంతో అక్కడి వెళ్లి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.  ఆ త‌రువాత సి.ఎం. సార్‌కి స‌ల‌హాదారుడిగా పెత్త‌నం చేశారు. ఔను. అయితే…..ఇప్పుడు వార్త ఏమిటంటే….

సోమేష్ కుమార్ భార్య డాగ్యన్ముద్ర గారికి యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో  25 ఎకరాల భూమి ఉంది.అక్కడ ఎకర భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ రూ.75 కోట్లు. 

అయితే ఈ భూమి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ధరణి పోర్టల్ లో ఖాతాలో  ఈ డాక్యుమెంట్  ఉంది.ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వార కొనలేదు. సాదాబైనామా ద్వారా భూమి కొన్నట్లు తెలుస్తోంది.  సాదాబైనామా అంటే ఏమిటి అనే క‌దా మీ డౌట్‌….తెల్ల కాగితంపై భూమి కొనుగోలు,  రిజిస్టర్ కాని క్రయ విక్రయాలు చేసిన భూములను విదానాన్ని సాదాబైనామా అంటారు.దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ (ఈసీ) సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదు. 

దీంతో ఈ భూమి అక్రమంగా వచ్చింద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.ఎలా వ‌చ్చింద‌నేగా మీ డౌట్‌….అదేనండి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ రేరా సెక్ర‌ట‌రీగా వున్న‌ప్పుడు సోమేష్ సార్ ఏమో ఛైర్మ‌న్‌గా వున్నారు. అప్ప‌డు బాల‌కృష్ణ సార్ వాళ్ళ భార్య‌కి గిఫ్ట్‌గా 25 ఎక‌రాలిచ్చాశాడ‌ట‌. ఆ సమయంలోనే యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరున 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినట్లు ఏసీబీ గుర్తించింది.  సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్‌ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. 

గ‌తంలో పేదలకు పంచిన భూముల్ని ధరణి పోర్టల్ పేరుతో లాక్కున్నారు. ఒక్క ఇ‍బ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్రణాళికలో సూత్రదారి సోమేశ్ కుమార్. అలాంటి వ్యక్తిని కేసీఆర్‌ సలహాదారుగా పెట్టుకొని క‌థ న‌డిపార‌ట‌.

ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక కూడా సోమేష్ కుమార్‌ ఉన్నారట ఏటా వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రాజెక్టును 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం వెనుక భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు. 

కోకాపేట భూముల విక్ర‌యం వ్య‌వ‌హ‌రంలో మైహోమ్, రాజ‌పుష్ప కు కేసీఆర్ స‌ర్కారు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో, వెయ్యి కోట్ల రూపాయ‌ల స్కామ్ జ‌రిగింది. ఈ ప్రొక్యూర్ మెంట్ టెండ‌ర్ వెబ్ సైట్ ద్వారా టెండ‌ర్లు పిలవ‌కుండా ఎంపిక చేసిన సంస్థ‌ల‌కు మేలు చేసేందుకే మాన్యువ‌ల్ ప‌ద్ద‌తిలో  అనుమ‌తించారు. 

అస‌లు వేలంలో ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు.. బిడ్డింగ్ లో విజేత త‌ర్వాత నిలిచింది ఎవ‌రు అనే అంశాల‌ను బ‌హిరంగ ప‌ర్చ‌కుండా అంతా గోప్య‌త పాటించారు. ఈ వేలంలో అస‌లు పార‌ద‌ర్శ‌క‌త లేదు.

2021 జూన్ 10న జీవో ఎంఎస్ 13 జారీ చేసి కోకాపేట భూముల వేలానికి ఎంఎస్ టిఎస్ ను అనుమ‌తించటం వెన‌క దురుద్దేశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల కోసం ఈ వేలం నిబంధ‌న‌ల్లో స‌ర్దుబాట్లు చేశారు. దీనికి స‌హ‌రించిన వారిలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ దే కీల‌క పాత్ర‌. జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు చెందిన మైహోమ్ గ్రూప్, సిద్ధిపేట క‌లెక్ట‌ర్ గా ఉన్నవెంక‌ట్రామిరెడ్డికి కుటుంబానికి చెందిన రాజపుష్ప సంస్థ‌ల‌కు అనుచిత ల‌బ్ది క‌లిగేలా చేశార‌న్నారు. ఎంఎస్ టిసితో కుమ్మ‌క్కు అయి కొన్ని సంస్థ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా వ్య‌వ‌హ‌రించ‌టం వల్ల ప్ర‌భుత్వానికి 1000 కోట్ల రూపాయ‌ల మేర న‌ష్టం వ‌చ్చింది.  

ప్ర‌భుత్వ ఈ ప్రొక్యూర్ మెంట్ టెండ‌ర్ వెబ్ సైట్ ద్వారా టెండ‌ర్లు పిలిచే అవ‌కాశం ఉన్నా ఎంఎస్ టీసీని రంగంలోకి దించి ముఖ్య‌మంత్రి కెసీఆర్ త‌నవారికి మేలు చేసేలా అధికారుల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వ ఖ‌జానాకు వెయ్యి కోట్ల రూపాయ‌ల మేర న‌ష్టం చేకూర్చారు.  ఈ వేలం ద్వారా క‌మిష‌న్ రూపంలో ఎంఎస్ టీసీకి 50 కోట్ల రూపాయ‌ల మేర చెల్లింపులు చేశార‌ని.. 

అదే ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా అయితే ఈ మేర‌కు ఆదా అయ్యేది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ కెవైసీని ఫాలో అవ్వాల్సి ఉండ‌గా..ఎంఎస్ టీసీ ఎంపిక చేసిన సంస్థ‌ల‌కు మేలు చేసేందుకే మాన్యువ‌ల్ ప‌ద్ద‌తిలో కూడా అనుమ‌తించారు. అస‌లు వేలంలో ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు..బిడ్డింగ్ లో విజేత త‌ర్వాత నిలిచింది ఎవ‌రు అనే అంశాల‌ను బ‌హిరంగ ప‌ర్చ‌కుండా అంతా గోప్య‌త పాటించారు.ఈ వేలంలో అస‌లు పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని పేర్కొన్నారు.  కోకాపేట భూముల విక్ర‌యం వ్య‌వ‌హ‌రంలో మైహోమ్, రాజ‌పుష్ప కు కేసీఆర్ స‌ర్కారు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో, వెయ్యి కోట్ల రూపాయ‌ల స్కామ్ జ‌రిగింది.

 రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూముల్ని స్వాహా చేయ‌డంలో కూడా ఆయ‌నే ప్ర‌ధాన‌ సూత్రదారి అట‌.  అత‌ని భార్య పేరున 25 ఎకరాలు ఎలా వ‌చ్చాయో ఎవ‌రికి తెలియ‌డం లేద‌ట‌.   ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక కూడా సోమేష్ కుమారే వున్నార‌ట‌.

గ‌త ప్ర‌భుత్వం పేద‌ల నుంచి లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడా హామీ ఎప్ప‌ట్టి వ‌ర‌కు నెర‌వేర్చ‌నుంది?