Leading News Portal in Telugu

Chile Forest Fires : చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం… 46మంది మృతి, వేలాది ఇళ్లు దగ్ధం


Chile Forest Fires : చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం… 46మంది మృతి, వేలాది ఇళ్లు దగ్ధం

Chile Forest Fires : చిలీ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 46 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అడవుల్లో భయంకరమైన మంటలు నిరంతరం వ్యాపిస్తున్నాయన్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా చిలీలో పరిస్థితి నిరంతరం దారుణంగా ఉంది.


అంతకుముందు శనివారం, చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని మధ్య, దక్షిణాన 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి దాదాపు 43 వేల హెక్టార్ల వరకు అడవి దగ్ధమైందని ఆయన చెప్పారు. అడవుల్లో పెరుగుతున్న మంటల దృష్ట్యా, చిలీ ప్రభుత్వం శనివారం మధ్య, దక్షిణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు – అధ్యక్షుడు
ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరుకుందని, ఇదే భయంకరమైన అడవి మంటలకు కారణమని అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు. బోరిక్ శనివారం మధ్యాహ్నం హెలికాప్టర్ ఉపయోగించి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అడవి మంటల కారణంగా కనీసం 46 మంది మరణించారు. పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వేలాది ఇళ్లు ధ్వంసం
చిలీ అడవుల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం. ఇది జరిగినప్పుడల్లా, డజన్ల కొద్దీ ప్రజలు మరణిస్తుంటారు. తాజా అగ్నిప్రమాదంలో వేలాది ఇళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. నగరమంతా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా వందలాది కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం తరుపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.