Leading News Portal in Telugu

Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు



Earthque
ఆప్ఘనిస్థాన్‌లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైంది. గత కొద్దిరోజులుగా ఆప్ఘనిస్థాన్ వరుస భూకంపాలతో అల్లాడుతోంది. దీంతో ప్రజలు భయకంపితులవుతున్నారు.  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.17 నిమిషాలతకు ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ ఎంత ఆస్తి నష్టం? ఎంత ప్రాణ నష్టం జరిగిందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఆప్ఘనిస్తాన్‌లో వరుసగా భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జనవరిలోనే పలుమార్లు భూకంపం సంభవించింది. తాజాగా ఫిబ్రవరిలో కూడా మరోసారి భూకంపం వచ్చింది. అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాణనష్టం తెలియరాలేదు.