Leading News Portal in Telugu

Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు


Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇండియన్ టూరిస్టులకు (Indian Tourists) ఇరాన్ సర్కార్ శుభవార్త చెప్పింది. భారతీయ పర్యాటకుల కోసం ఉచిత వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Announces) ఒక ప్రకటన విడుదల చేసింది.


ఇకపై భారతీయ పర్యాటకులు వీసా  (Free Visa Policy) లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత వీసా సదుపాయాన్ని పొందవచ్చు. ఎక్కువ కాలం ఉండాలనుకుంటే మాత్రం ఇతర వీసాల కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని పేర్కొంది.

ఉచిత వీసా ఎన్ని రోజులంటే..
ఉచిత వీసాతో 15 రోజుల పాటు ఉండొచ్చు. అటు తర్వాత ఈ వ్యవధిని పొడిగించడం ఉండదు. ఇది కేవలం టూరిస్టులకు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇరాన్‌లో నివసించేవారు మాత్రం ఇతర వీసాలను పొందాల్సి ఉంటుంది.