Leading News Portal in Telugu

సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు | nia raids on senior journalist venugopal house| links| maoists| varavararao| modi| assasination


posted on Feb 8, 2024 11:21AM

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది. పలు మీడియా సంస్థలలో పని చేసిన వేణుగోపాల్.. విపప్ల రచయత వరవరరావుకు అల్లుడు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నదని తెలుస్తోంది.   హిమాయత్ నగర్ లోని ఆయన నివాసంలో ఈ ఉదయం ఆరుగంటల నుంచే ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అలాగే పౌరహక్కుల సంఘం నాయకుడు రవి శర్మ నివాసంలో సైతం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది. 

గతంలో వరవరరావును సైతం ఎన్ఐఏ గోరెగావ్ కుట్ర కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును అప్పట్లో ఆయన నివాసంలో పుణె పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారించారు.  ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు ఆరోపించిన పోలీసులు  మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు అప్పట్లో పేర్కొన్నారు.  కాగా ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యంగా పాలక వర్గాలు దమనకాండ ప్రయోగిస్తున్నాయి ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు.