Leading News Portal in Telugu

Recession In Tech: “మాంద్యం” గురించి మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేశారు భయ్యా.. ఓ టెక్కీ ఆవేదన..


Recession In Tech: “మాంద్యం” గురించి మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేశారు భయ్యా.. ఓ టెక్కీ ఆవేదన..

Recession In Tech: ఏడాది కాలంగా టెక్ రంగం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటివి వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం భయంలో ఖర్చులను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు దీనికి ప్రభావితమయ్యారు. ద్యోగాల కోతలను ట్రాక్ చేస్తున్న స్టార్ట్-అప్ Layoffs.fyi ప్రకారం ఇప్పటివరకు, 2024లో దాదాపు 32,000 మంది టెక్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.


ఇదిలా ఉంటే, బెంగళూర్‌కి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న జిష్ణు మోహన్ అనే వ్యక్తి..‘ టెక్ రంగంలో మాంద్యం’ గురించి మాట్లాడినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు. 24 గంటల్లోనే అతడికి సదరు కంపెనీ లేఆఫ్ ఇచ్చింది. ప్రస్తుతం అతను పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో లైఫ్ బెనిఫిట్స్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా ఉద్యోగం చేస్తున్న అతను, కంపెనీలో ఫుల్ టైమ్ వర్కర్‌గా ఉన్నారు. ప్రస్తుతం అతను కేరళలోని కొచ్చి నుంచి రిమోట్‌గా పనిచేస్తున్నాడు.

‘‘టెక్ రంగంలో మాంద్యం పరిస్థితి తనను అశాంతికి గురిచేస్తోంది. నా కెరీర్లో లోయెస్ట్ కాన్ఫిడెంట్‌కి చేరుకోవచ్చు’’ అని ఫిబ్రవరి 7న జిష్ణు ట్విట్ చేశారు. కట్ చేస్తే ఫిబ్రవరి 8న అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాననే విషయాన్ని తెలుసుకున్నాడు. 24 గంటల్లోనే తన ఉద్యోగం కోల్పోయానని చెప్పారు. తాను కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నానని, ఎదైనా ఉంటే చెప్పాలని ట్వీట్ చేశారు. ‘‘ఫిబ్రవరి 7న ట్వీట్ చేస్తున్న సమయంలో నా కంపెనీ లేఆఫ్‌ని ప్లాన్ చేస్తుందని తెలియదని ట్విట్టర్‌లో ట్రెండ్స్, ఎంఎన్‌సీల నుంచి లేఆఫ్ వార్తలను చూసిన తర్వాత నేను ఈ ట్వీట్ చేశాను’’ అని చెప్పారు.

అతని ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 1.36 వ్యూస్ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతనికి ఉద్యోగాల గురించి చెబుతూ..రెస్యూమ్ పంపాలని కోరుతున్నారు. మీరు ఏ ప్రొఫైల్, ఏ లొకేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అని అడుగుతున్నారు. మీకు త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయి, ఆల్ దిబెస్ట్ అంటూ మరికొందరు రీట్వీట్ చేస్తున్నారు.