వెంటిలేటర్ పై మంత్రి రోజా పొలిటికల్ కెరీయర్! | roja political carear on ventilator| corruption| queen| ycp| councilar
posted on Feb 12, 2024 10:24AM
మంత్రి రోజా.. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. జగన్ పై ఈగ వాలనీయకుండా రోజా తన మాటల గారడీతో విపక్షాలపై ఇష్టారీతిగా రెచ్చి పోతుంటారు. అదే సమయంలో ఆమె తన నోటి దురుసును సొంత పార్టీ నేతలపైనా ప్రయోగిస్తుండటం కద్దు. అందుకే పార్టీ తరఫున ఎంత ధాటిగా మాట్లాడినా ఆమెకు పార్టీలో ఎటువంటి మైలేజీ రాని పరిస్థితి ఉంది. ఇక పార్టీలో తన పరిస్ధితి ఏమిటో తనకే తెలియని స్థితిలో ఉన్న రోజా ప్రతిపక్షంపై విమర్శల విషయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలపై తన తిట్ల దండకమైనా జగన్ తనకు నగరి టికెట్ కేటాయించేటట్లు చేస్తుందని ఆశపడుతున్నారు.
అయితే జగన్ మాత్రం రోజాను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. సిట్టింగుల మార్పు అంటూ జగన్ ఇప్పటి వరకూ ఏడు జాబితాలు ప్రకటించారు. అయితే రోజాకు మాత్రం నగరి గ్యారంటీ అన్న హామీ దక్కలేదు. ఇప్పటి వరకూ జగన్ రోజాకు నగరి అనే కాదు.. అసలు ఏ నియోజకవర్గం నుంచీ టికెట్ ఖరారు చేయలేదు. అంతే కాదు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆమె పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగాలేదంటూ నివేదికలు అందాయన్న లీకులు ఇస్తున్నారు. నగరిలో ఆమెకు పోటీ చేసేందుకు చాన్స్ ఇస్తే ఓటమి ఖాయమని పార్టీ శ్రేణులే చెబుతున్నాయని అంటున్నారు. దీంతో రోజా పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉందని భావించాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ అధినేత జగన్ స్వయంగా చేయించుకున్న అన్ని సర్వేల్లో సగరి ప్రజలు రోజాపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అవినీతిలో రోజా క్వీన్ అన్నభావన అక్కడి ప్రజలలో ఉందంటున్నారు. భూమలు , మట్టి దోచుకున్నారని విమర్శిఃస్తున్నారనీ సర్వేల్లో తెలింది. గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు రోజా తనపై వచ్చిన, వస్తున్న అవినీతి ఆరోపణలకు ముందు సమాధానం చెప్పి, ఆ తరువాత చంద్రబాబుపైన విమర్శలు చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. రోజాపై ఆమె పార్టీకి చెందిన కౌన్సిలరే 40 లక్షల లంచం ఇచ్చానని మీడియా సమావేశంలో చెప్పినా రోజా ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. రోజాకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదంటే ఆమె అవినీతికి పాల్పడినట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై నిత్యం నిరాధార ఆరోపణలతో విరుచుకుపడుతున్న రోజాపై సొంత పార్టీ నుండే అవినీతి ఆరోపణలు వచ్చాయనీ, పార్టీ కూడా ఆ ఆరోపణలపై మౌనం వహించడం ద్వారా రోజాపై వచ్చినవి ఉట్టి ఆరోపణలకు కాదని అంగీకరించేసినట్లైందని అంటున్నారు.
దీన్ని బట్టే పార్టీ ఆమెను పక్కన పెట్టేసిందని అర్ధమౌతోందనీ, అయినా రోజా తెలుగుదేశం అధినేతపై ఆరోపణలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్ము వేయడంగానే భావించాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.తన రాజకీయ కెరియర్ కు ఎండ్ కార్డ్ పడిందని రోజా ఇప్పటికైనా గ్రహించి ప్రత్యర్థులపై విమర్శలకు పుల్ స్టాప్ పెట్టి తన సంగతి చూసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.