
మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది.. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10, 500 కోట్లు ఖర్చవుతోందని, ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారన్నారు రేవంత్ రెడ్డి. 2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశారని, సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తిందన్నారు రేవంత్ రెడ్డి.
Pakistan: పాక్ ఎన్నికలపై వివాదం.. రిగ్గింగ్ జరిగిందని దాఖలు చేసిన 30 పిటిషన్లు తిరస్కరణ
అంతేకాకుండా..’మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారు. మేడిగడ్డ కుంగినప్పుడు పోలీసుల నిర్బంధం తో రాలేక పోయాము. రాహుల్ గాంధీ తో కలిసి రావడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది అని చూసే అవకాశం రాలేదు. తన తప్పులు కప్పి పుచ్చుకోవాలని చూసింది గత ప్రభుత్వము. ప్రాజెక్టు డిసైన్ లోపం.. బడ్జెట్ అంచనా లోపం తో అవినీతి. . కాగ్ నివేదిక లో కూడా వేల కోట్ల దోపిడీ పాల్పడింది అని చెప్పింది. విజిలెన్స్ నివేదికపై చర్చ జరిగితే బండారం బయట పడుతుంది అని కేసీఆర్.. krmb పేరుతో సభ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ మీద ఎదురు దాడి చేసిండు. సుద్దాపుస మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. చావు నోట్లో తలకాయ పెట్టినోడివి అయితే..అసెంబ్లీ లో అడుగు ఎందుకు పెట్టడం లేదు. . సత్యహరిచంద్రుడి కి తమ్ముడివే అయితే.. సభకు ఎందుకు రావు. డిసెంబర్ 1..2023 లో స్మితా సబర్వాల్ ఏం రాశారు. మీ దగ్గర ఇరిగేషన్ సెక్రెటరీ గా పని చేసిన ఆమె రాసిన లేఖ బయట పెట్టినం కదా. మేడిగడ్డ అందరం కలిసి పోదాం అని అడిగిన. మీరు రాలేదు. మీకు వీలైన టైం చెప్పండి అని కూడా చెప్పినం అయినా రాలేదు..’ అని రేవంత్ అన్నారు.
Pakistan: పాక్ ఎన్నికలపై వివాదం.. రిగ్గింగ్ జరిగిందని దాఖలు చేసిన 30 పిటిషన్లు తిరస్కరణ