Leading News Portal in Telugu

Pawan Kalyan: డైలామాలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు..


Pawan Kalyan: డైలామాలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు డైలమాలో ఉన్నాయి. హెలీపాడ్ ఏర్పాటుకు అధికారులు అనుమతుల నిరాకరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం పర్యటనను పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. ఇటు.. అమలాపురంలోనూ హెలీపాడ్ ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Viral Video: హెల్మెట్ లేదని ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుడు ఏం చేశాడో తెలుసా..!

హెలీకాప్టర్ లో పర్యటనలకు వెళ్లి రాత్రికి అమరావతి వచ్చేలా పవన్ పర్యటనలను షెడ్యూల్ చేస్తున్నారు. ఎన్నికల కసరత్తు చేపట్టాల్సి ఉన్నందున ప్రతి రోజూ పార్టీ కార్యాలయానికి రావాలని పవన్ భావించారు. వివిధ ప్రాంతాల్లో హెలీపాడ్ల ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అనుమతులు నిరాకరించడంతో జనసేన మండిపడుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లనే అనుమతి ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోసం హెలిప్యాడ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ హెలిప్యాడ్‌ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు లేకపోయినా పవన్‌కు అభ్యంతరాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Congress: బుధవారం రాహుల్ యాత్ర రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..!

బుధవారం నుంచి పవన్ కల్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించున్నారు. మూడ్రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటనలు సాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని భావిస్తోన్న పవన్.. ఇందుకోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో హెలిప్యాడ్లకు అనువైన ప్రదేశాలను ఆ పార్టీ నేతలు పరిశీలించే పనిలో వున్నాయి. మరోవైపు..బుధవారం అమలాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందా.. లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి వుంది.