Leading News Portal in Telugu

PM Modi: అబుదాబిలో భారతీయులు కొత్త చరిత్ర సృష్టించారు


PM Modi: అబుదాబిలో భారతీయులు కొత్త చరిత్ర సృష్టించారు

యూఏఈలోని (UAE) అబుదాబిలో (Abu Dhabi) మంగళవారం జరిగిన ‘అహ్లాన్ మోడీ’ (Ahlan Modi) కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలోకి మోడీ ఓపెన్ టాప్‌ వాహనంలో ప్రవేశించి అందరికీ అభివాదం చేశారు. ప్రతికూల వాతావరణం ఉన్న కూడా పెద్ద ఎత్తున భారతీయులు స్టేడియానికి తరలివచ్చారు. అంతేకాకుండా దక్షిణాదికి చెందిన నాలుగు భాషలతో మోడీ ప్రసంగం ప్రారంభించారు. మొదటగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం.. ఇలా నాలుగు భాషల్లో భారతీయులను పలకరించారు. అత్యధికంగా ఈ ప్రాంతాల నుంచే భారతీయులు ఇక్కడ వస్తున్నారని వ్యాఖ్యానించారు. అందరూ చప్పట్లతో మోడీని (PM Modi) అభినందించారు. దీంతో మరింత ఉత్సాహంతో ప్రధాని మోడీ ప్రసంగించారు.


భారత్-యూఏఈ స్నేహాన్ని మోడీ కొనియాడారు. అబుదాబిలో భారతీయులు కొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చారని… కానీ ప్రతి ఒక్కరి హృదయం ఇక్కడ కనెక్ట్ చేయబడిందని తెలిపారు. ఈ చారిత్రాత్మక స్టేడియంలో ప్రతి హృదయ స్పందన, ప్రతి శ్వాస, ప్రతి స్వరం ఏం చెబుతుందంటే.. భారత్-యూఏఈ స్నేహం చిరకాలం ఉండాలని కోరుకుంటుందని మోడీ పేర్కొన్నారు.

అంతకముందు అబుదాబిలో జరిగిన భారీ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోడీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతలు పాల్గొన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ యూఏఈ పర్యటనకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో మోడీకి దేశాధినేతలు ఘనస్వాగతం పిలికారు. అనంతరం ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇకపోతే బుధవారం అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారతీయులు తరలిరానున్నారు.