Leading News Portal in Telugu

Tummala Nageswara Rao : కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు…


Tummala Nageswara Rao : కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు…

ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా లేరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును అందరం గౌరవించాలన్నారు. కానీ కేసీఆర్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. నాకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనవారని, నాకు వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం పజలు మూర్ఖులన్నట్టు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పాలు ఇచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఎన్నుకున్నారు అంటూ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవించక పోగా ప్రజలను చులకన చేసి మాట్లాడడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని తుమ్మల నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. ఇంతటి రాజకీయ అనుభవమున్న కేసీఆర్ ఒక్క ఓటమితోనే ఓటర్ల విజ్ఞతను శంకిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.


 
Mamata Banerjee: రైతులపై టియర్ ప్రయోగించడంపై మమత ఫైర్
 

ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగని మాటలని ఆయన అన్నారు. కృష్ణ గోదావరి నదులపై తెలంగాణ వాటాను వదులుకున్నది కేసిఆర్. పదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి న్యాయం చేయకపోగా నాశనం చేసిన చరిత్ర మీదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో జరిగింది అవినీతి కాక ఏమిటి ? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే కేసీఆర్ కు కనీసం బాధ్యత, బాధ ఉన్నట్లు కనపడకపోవడం విచారకరం. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే ఏమి పికనీయ పోయారు అంటూ కేసీఆర్ మాట్లాడడం ఎంత బాధ్యతారాహిత్యం..? అని ఆయన ప్రశ్నించారు. నల్లగొండకు పోయే ఓపికుంది కానీ ఇంటిపక్కనున్న అసెంబ్లీకి మాత్రం రారు. ప్రజలెన్నుకున్న సభలో ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పేధైర్యం లేకనే శాసన సభకు రావడం లేదని తుమ్మల వ్యాఖ్యానించారు.

Dentist: ట్రీట్మెంట్ పేరుతో బాగున్న దంతాలు పీకేశాడు.. రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని డాక్టర్‌కి ఆదేశం..