Leading News Portal in Telugu

Dakota Johnson: ఏంటీ.. స్టార్ హీరోయిన్.. నగ్నంగా ఈవెంట్ కు వచ్చిందా.. ?


Dakota Johnson: ఏంటీ.. స్టార్ హీరోయిన్.. నగ్నంగా ఈవెంట్ కు వచ్చిందా.. ?

Dakota Johnson: డకోటా జాన్సన్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ, హాలీవుడ్ మూవీస్, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ చూసేవారికి బాగా పరిచయం. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాతో ఈ హాలీవుడ్ బ్యూటీ బాగా గుర్తింపు తెచ్చుకుంది. మూడు పార్ట్స్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. డకోటాను స్టార్ ను చేసేసింది. ఇక ఈ సినిమాల తరువాత డకోటా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇకపోతే ఈ చిన్నది.. ఫ్యాషన్ రంగంలో ఆరితేరిపోయి ఉంది. బయటకు వస్తే.. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె ఫ్యాషన్ ఉంటుంది. ప్రస్తుతం డకోటా మేడమ్ వెబ్ అనే సినిమాలో నటిస్తోంది.


ఇక ఈ సినిమా ప్రీమియర్ ఈవెంట్ సోమవారం లాస్ ఏంజిల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో అందరి దృష్టి డకోటా డ్రెస్ మీదనే ఉంది. అంతలా ఎందుకు అంటే.. ఆమె సినిమా టైటిల్ కు తగ్గట్టు ఒక వెబ్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ ను షీర్ చైన్ మెటల్ అంటారు. ఆమె గౌనులోని లింక్‌లను ఒక క్లిష్టమైన వెబ్‌తో పోల్చవచ్చు. పై నుంచి కింద వరకు లింకులతో ఉన్న సాలెగూడెలా ఉంది. ఆమె శరీరం మొత్తం అందులో నుంచి కనిపిస్తూ ఉంది. దీంతో సడెన్ గా ఆమెను చూసిన వారందరూ.. ఏంటీ.. స్టార్ హీరోయిన్.. నగ్నంగా ఈవెంట్ కు వచ్చిందా.. ? అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ఆ తరువాత దగ్గరనుంచి చూస్తే కానీ తెలియదు.. లోపల డకోటా స్కిన్ సూట్ ను ధరించిందని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.