Leading News Portal in Telugu

Allari Naresh : పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రాబోతున్న అల్లరోడు..


Allari Naresh : పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రాబోతున్న అల్లరోడు..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నరేష్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.. గతంలో కొన్ని సినిమాలు నిరాశ పరిచిన కూడా ఇప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. ఇప్పుడు మరో పీరియాడిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..


నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అప్పట్నుంచి వైవిధ్యమైన కథలతో వస్తూ వరుసగా ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సభకు నమస్కారం, బచ్చలమల్లి, ఇంకో లవ్ జానర్ సినిమా ఉంది. తాజాగా అల్లరి నరేష్ ఎప్పుడూ టచ్ చేయని ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

ఊరుపేరై భైరవకోన నిర్మాత ఓ ఇంటర్వ్యూ లో మేము మొదటి నుంచి సినిమా సినిమాకి జానర్ మారుస్తున్నాము. ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో తీసుకొస్తున్నాము. మొదట సోషల్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇది సోషియో ఫాంటసీ. తర్వాత అల్లరి నరేష్ తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీస్తున్నాము.. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం తో మరో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.. ఇటీవల నరేష్ కొత్త కథలతో సినిమాలతో వస్తున్నాడు.. ఇక ఇప్పుడు యాక్షన్ కథతో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..