Leading News Portal in Telugu

Jeevan Reddy: కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు.. అందులో సందేహం లేదు


Jeevan Reddy: కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు.. అందులో సందేహం లేదు

Jeevan Reddy: కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 1999లో చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం వల్ల కేసిఆర్ తెలంగాణ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. అంతకుముందు కేసిఆర్ తెలంగాణ అంశాన్ని కనీసం పట్టించుకోలేదని మండలిలో జీవన్ రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో ఏ అంశాలని లేవనెత్తారు.. వాటిని ఎంతవరకు గత ప్రభుత్వం అమలుచేసింది? అని ప్రశ్నించారు. గత పాలకులు నిధులు, నియామకాలు విస్మరించారు. తుమ్మెడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపడుతే అది సుందిళ్ళకు వచ్చేదన్నారు. అలా చేయడం వల్ల మేడిగడ్డ డొల్ల ప్రాజెక్ట్ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా మేడిగడ్డ డొల్ల ప్రాజెక్ట్ గానే ఉందన్నారు. మనకు రావాల్సిన 512tmc లు సీమాంధ్రకు పోయాయని తెలిపారు. 11 క్యూసెక్కుల నీరు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 44 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడును.. కేసిఆర్ హయాంలో 88 క్యూసెక్కులకు చేరుకుందన్నారు.


Read also: US Snow Storm: అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్, 1200 విమానాలు రద్దు!

ఇదేనా ఉద్యమ స్పూర్తి…అప్పటి ప్రభుత్వం ఏం చేసింది..? ఇదేనా హక్కుల పరిరక్షణ..? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన చీఫ్ ఇంజనీర్ ను ఉరితీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లోరినేషన్ 20 కిలోమీటర్ల వరకు మాత్రమే పనికొస్తుందన్నారు. కాళేశ్వరం ఇవాళ నెర్రలు కొట్టిందన్నారు. గత ప్రభుత్వంలో ఇంజనీర్లు ప్రభుత్వం ఏది చెప్తే దానికి సంతకం పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కులను కాలరాశారని మండిపడ్డారు. బొగ్గు లభ్యత ఎక్కడ ఉందో అక్కడ థర్మల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటుచేయాలన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లు కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ లో 4,000 మెగావాట్ల నిర్మాణం చేపడిటే బాగుండేదని అన్నారు. భూమి, నీరు లభ్యత ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ యాదాద్రి ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Read also: CM Revanth Reddy: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. నేడు సీఎం చేతులమీదుగా నియామక పత్రాలు

మరోవైపు కడియం మాట్లాడుతూ.. ఎంత మేరకు డ్యామేజి అయ్యిందో..ఆ మేరకు కాపర్ డ్యామ్ కట్టండి అన్నారు. విచారణ చేసి..చర్యలు తీసుకోండి అన్నారు. కానీ.. డ్యామేజి పోర్షన్ సెట్ చేయండి అని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేసి..పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. . రాజకీయం చేసే వరకు చేశారు.. ప్రజల కోణంలో కూడా ఆలోచన చేయాలన్నారు.
Priyanka Nalkari : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాది తిరక్కుండానే విడాకులు..