తెలుగుదేశం గూటికి లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ముహూర్తం ఎప్పుడంటే?! | ycp mp lavu sri krishna devarayulu join tdp| febraury| 22nd| jagan| ru;ing| party
posted on Feb 14, 2024 10:01AM
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో సిట్టింగులు, కీలక నేతలూ పార్టీని వీడుతున్నారు. అలా వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో వైసీపీ శిబిరంలో తీవ్ర నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి. మరో వైపు పార్టీ అధినేత జగన్ సీతయ్య తరహాలో ఎవరి మాటా విననంటూ సిట్టింగుల మార్పు నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి.
అధినేతే ఓటమి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే ఇక చేయగలిగిందేముంది.. ప్రజాభీష్ఠానికి అనుగుణంగా నడుచుకుంటూ తెలుగుదేశం, జనసేన కూటమి కోసం పని చేస్తే పోలా అన్న భావనకు వచ్చేస్తున్నారు. వరుస జంపింగులతో ఎన్నికల నోటిఫికేష్ వెలువడే నాటికి వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇప్పటికే పార్టీకి దూరమైన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నారన్న సంగతీ విదితమే. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఔను ఈ నెల 22న లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం గూటికి చేరనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.