Leading News Portal in Telugu

Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్..


Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేదు.. గత రెండేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదని తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టాడు.. 2022లో ‘ఒకే ఒక జీవితం’ మూవీ వచ్చి సూపర్ హిట్టు అందుకున్న శర్వానంద్… ఇప్పుడు ఈ సినిమాను చేస్తున్నారు.. తన పెళ్లి అవ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు..


గత ఏడాది సూపర్ హిట్ కొట్టిన దర్శకుడి తో సినిమా చేస్తున్నాడు.. గత ఏడాది శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా తన 36వ సినిమాని చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో నేచురల్ యాక్ట్రెస్ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది..

ఎటువంటి హడావుడి లేకుండా లాంచ్ అయ్యిపోయింది. అలాగే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశారని తెలుస్తుంది.. ఈ ఏడాది మార్చి నుంచి మొదటి వారం వరకు ఈ మూవీ మొదటి షెడ్యూల్ జరుగుతుందని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో మాళవిక నాయర్ తో పాటు సంయుక్త మీనన్, సాక్షి వైద్య కూడా నటించబోతున్నారని సమాచారం. మరి దర్శకుడు అబ్బరాజు.. సామజవరగమన లాగా ఈ చిత్రాన్ని కూడా సరికొత్తగా తెరకేక్కించి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి..