
ప్రతి ఒక్కరు తమ మాతృభాషను రక్షించుకోవాలని ఇంగ్లీష్ ఫై మోజు ఉండాలి కానీ తమ మాతృభాషను చంపుకోకూడదని అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేడు వసంత పంచమి( శ్రీ పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేట లోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి తమ మాతృభాషను రక్షించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు మాతృభాషను నేర్పించాలని ఇతర భాషలపై మోజు పెంచుకోవాలి తప్ప తమ మాతృభాషను చంపుకోకూడదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Domestic Violence: తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింస ఎలా అవుతుంది.? భార్య పిటిషన్ కొట్టేసిన కోర్టు..
ఆ దిశగా కేంద్రప్రభుత్వం మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఇంకా నెలకొని ఉన్నదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంస్థలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో నిరక్షరాస్యతను పారద్రోలి అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగిందని ఎవరైనా తమకు నచ్చిన మాతృ భాషలో చదువుకోవచ్చు పరీక్షలను రాయవచ్చని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
California: కాలిఫోర్నియాలో పిల్లలతో సహా భారతీయ కుటుంబం మృతి.. హత్య-ఆత్మహత్యగా పోలీసుల అనునమానం