Leading News Portal in Telugu

Black Hole: పాలపుంత మధ్యలో “బ్లాక్ హోల్” కల్లోలం.. వేగంగా తిరుగుతూ, రగ్బీ బాల్ ఆకారంలోకి..


Black Hole: పాలపుంత మధ్యలో “బ్లాక్ హోల్” కల్లోలం.. వేగంగా తిరుగుతూ, రగ్బీ బాల్ ఆకారంలోకి..

Black Hole: సైన్స్ అభివృద్ధి చెందే కొద్ది విశ్వంలోని కోటానుకోట్ల వింతల్లో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మన భూమి, సూర్యుడు, సౌర కుటుంబంతో పాటు కొన్ని బిలియన్ల నక్షత్రాలకు కేంద్రంగా ఉన్న మిల్కీ వే(పాలపుంత) గెలాక్సీ ఉంది. కొన్నాళ్ల వరకు పాలపుంత గెలాక్సీ మధ్యలో సూపర్ మాసివ్ ‘బ్లాక్ హోల్’ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, సైన్స్ పురోగతి సాధించడంతో నిజంగా మిల్కీవే కేంద్రంలో బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించారు. సజిటేరియస్ A బ్లాక్ హోట్ భూమి నుంచి దాదాపుగా 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.


అయితే, ఇది చాలా వేగంగా తిరుగుతూ, రగ్బీ బాల్ ఆకారంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది స్పేస్ టైమ్‌ని మారుస్తోందని వెల్లడించారు. నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ఎక్స్-రే, రేడియో మెజర్మెంట్ సమగ్ర విశ్లేషణపై ఫలితంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాక్ హోల్‌కి రెండు ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి, ఒకటి ద్రవ్యరాశి లేదా దాని బరువు, రెండోది అతి ఎంత వేగంగా తిరుగుతుందో తిరుగుతుంది. ఈ రెండింటి ఆధారంగానే సదరు బ్లాక్ హోల్ ఎలా ప్రవర్తిస్తుందనే దానిని వివరించవచ్చు. శాస్త్రవేత్తలు సజిటేరియస్A బ్లాక్ హోల్ ఖచ్చితమైన భ్రమణ వేగాన్ని గుర్తించలేకపోయారు. అయితే, దాని బరువు సూర్యుడి కంటే దాదాపుగా 4 మిలియన్ రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.