
తెలంగాణ రాష్ట్రములో ఉన్న 197 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన కార్య వర్గములు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. ఈ మేరకు ఈ నెల 12న ఇప్పటికీ కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడమైనదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరాధరణకు గురైన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పునర్వైభవం తెచ్చే దిశలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోయే కమిటీలకు సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు అయ్యే, ప్రతి మార్కెట్ కమిటీ కార్య వర్గంలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని ( ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తో కల్పి ) 12 మంది నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు అధీకృత వ్యాపారస్తులు, (లైసెన్స్డ్ ట్రేడర్స్ ) మిగిలిన నలుగురు ఎక్స్ఆఫిషియా సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ సరిహద్దు వెంబడి భారత పోస్టులపై పాక్ కాల్పులు..
పాలక వర్గ పదవీకాలం రెండేళ్లకు ఉండగా వీరిని రెండుమార్లు మరియొక్క ఆరు నెలలు పొడిగించే అవకాశంకలదని ఆయన వెల్లడించారు. ఈ మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ కాబడే ఛైర్మన్ లలో అన్నీ వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పించనున్నట్లు మంత్రి తెలియజేసారని, అదేవిధముగా చిన్న రైతులు, ఇతరులు మరియు పాడి రైతులకు కూడా సభ్యులు ఉంటారు. ఈ మార్కెట్ కమిటీలకు ధరల నియంత్రణ, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి / ఎగుమతి వివరాలు, మార్కెట్ యార్డుల నిర్వహణ వంటి భాద్యత అప్పగించబడుతాయని ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటయే మార్కెట్ కమిటీలు అన్నీ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకొని తెలంగాణ, రైతాంగానికి సేవ చేస్తారని అభిలాషిస్తున్నట్లు తెలియజేసారన్నారు.
Delhi: రామ్‌నాథ్ కోవింద్ కమిటీతో అసదుద్దీన్ భేటీ.. ఏం చర్చించారంటే..!