Leading News Portal in Telugu

Save The Tigers : సేవ్ ది టైగర్స్ సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?


Save The Tigers : సేవ్ ది టైగర్స్ సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్”..ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో సుజాత, దేవయాని మరియు పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్‌ మరియు ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించారు. తేజా కాకుమాను దర్శకత్వం వహించాడు.. అయితే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌ ఓటీటీలో సూపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది.భార్య బాధితులైన గంటా రవి, రాహుల్‌, విక్రమ్‌కు అనుకోకుండా మంచి స్నేహితులుగా మారతారు. బోరబండ బస్తీలో గంటా రవి(ప్రియదర్శి) పాల బిజనెస్ చేస్తుంటాడు . ఆ బస్తీలో ఉండటం భార్య హైమవతికి (సుజాత)) నచ్చదు. ఆ విషయంలో ఇద్దరు ఎప్పుడూ గొడవపడుతుంటారు. సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేసి రాహుల్ (అభినవ్ గోమటం) ఇంట్లో ఖాళీగా ఉంటాడు.ఇంటి బాధ్యత మొత్తం భార్య మాధురిపై (పావని గంగిరెడ్డి) పడుతుంది.


విక్రమ్ (చైతన్య కృష్ణ) ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. భార్య రేఖ (దేవయాని) ఫెమినిస్ట్‌. భార్య చేసే డామినేషన్ కారణంగా ఇబ్బందులు పడుతుంటాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న మాధురిని రాహుల్ ఎందుకు అనుమానించాడు..రేఖ వల్ల విక్రమ్ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది..ఈ ముగ్గరు కాపురాల్లో ఎలాంటి కలతలు వచ్చాయన్నది ఎంటర్‌టైనర్‌గా ఫస్ట్ సీజన్‌లో డైరెక్టర్ చూపించాడు.గత ఏడాది ఏప్రిల్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ వన్‌ రిలీజైంది .ఫస్ట్ సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సీజన్ 2 ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.తాజాగా సేవ్ ది టైగర్స్ సీజన్ 2పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది. త్వరలోనే సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.బుధవారం మేకర్స్ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రియదర్శి, చైతన్యకృష్ణతో పాటు అభినవ్ గోమటం జైలులో ఉన్నట్లుగా చూపించారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 పోస్టర్ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మార్చి ఫస్ట్ వీక్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.