Leading News Portal in Telugu

Minister Botsa Satyanarayana: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు


Minister Botsa Satyanarayana: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Minister Botsa Satyanarayana: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారయణ.. ఉమ్మడి రాజధానిపై తాజాగా వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన తరుణంలో.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది వైసీపీ.. ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. అనుభవం వున్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించిన ఆయన.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల ను వక్రీకరించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరం అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్తియా? అని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అసలు హైదరాబాద్‌ నుంచి అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అన్నారు.


ఇక, హైదరాబాద్ లో ఎవరికైనా ఆస్తులు వుండవచ్చు.. నాకూ హైదరాబాద్ లో ఇల్లు వుంది.. ఏపీలో మంత్రిని అయితే అక్కడ నా ఆస్తిని ప్రభుత్వం కబ్జా చేస్తుందా..? అని ప్రశ్నించారు బొత్స… ఏపీలో ఓట్లు, డోరు నెంబర్ లు కూడా లేని వాళ్లు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. మీ అడ్రస్ ఏదీ అంటే పక్కింటి డోర్ నెంబర్ చెప్పే పరిస్థితి ఉందన్నారు. రాజధాని పై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదన్నారు. ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు. విభజన చట్టంలో అప్రస్తుతంగా వున్న సమస్యల పరిష్కా రం కోసం ప్రయత్నిస్తానని మాత్రమే వైవీ సుబ్బారెడ్డి చెప్పారని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స. ఇక, మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో తెలుసకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=x2ftpTDXKJE