
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల (One Nation One Election) నిర్వహణపై ఏర్పడిన అత్యున్నత స్థాయి కమిటీని ఢిల్లీలో (Delhi) ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కలిశారు. ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind).. వారి సభ్యులను ఎంఐఎం అధినేత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో పలు అంశాలను అసదుద్దీన్ చర్చించారు. జమిలి ఎన్నికలపై ఎంఐఎం పార్టీ అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇదిలా ఉంటే గతంలోనే జమిలి ఎన్నికలను మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు గతంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉన్నతస్థాయి కమిటీకి లేఖ రాశారు. జమిలి ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇవి భారత ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విపత్తు కలిగిస్తాయని అసదుద్దీన్ లేఖలో పేర్కొన్నారు.
దేశంలో తరచుగా ఎన్నికలను నివారించటం, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని తగ్గించటమే జమిలి ఎన్నికల ఉద్దేశం. మన దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభిప్రాయాలను కమిటీ సేకరిస్తోంది. భవిష్యత్‌లో కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.