Leading News Portal in Telugu

Renuka Chowdhury: బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారు


Renuka Chowdhury: బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారు

Renuka Chowdhury: బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారని, ప్రధాని రాజకీయాలు చెయ్యొచ్చు… దేశంలో ప్రజలకు అన్నం పెడుతున్న రైతులు ఉద్యమాలు చెయ్యవద్దా? అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని తెలిపారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన గుర్తింపు కాదు… ఖమ్మంలో కాంగ్రెస్ జెండా నీ వదలకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఇచ్చిన గుర్తింపు అన్నారు. మా అధినేత సోనియా గాంధీతో పాటు పెద్దలసభలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్ లో ప్రస్తుతం చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది… స్టాండర్డ్స్ మారిపోయాయని తెలిపారు. అవన్నీ ఇప్పుడు మారబోతున్నయని అనుకుంటున్నామన్నారు. సభలో సభ్యులను, ఆడవాళ్ళను… భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇక ఆ పప్పులు సాగవన్నారు. ఖమ్మం లోక్ సభ కి ఎవ్వరినీ పోటీలో ఉంచిన గెలిపించుకుంటామన్నారు.


Read also: Anti Valentines Week : యాంటీ వాలంటైన్ వీక్.. ఈ రోజుల ప్రత్యేకత ఏంటో తెలుసా ?

సోనియా గాంధీ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిద్దం అనుకున్నామన్నారు. ఖమ్మం బరిలోకి చాలామంది ఆశావహులు ఉన్నారని, అధిష్టానం నా అభిప్రాయం అడగలేదు ఇంకా అన్నారని తెలిపారు. ఇక రాష్ట్రంలో పదేళ్లు పరిపాలించి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో మా పైన విరుచుకుపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పూర్ లూసర్ అని మండిపడ్డారు. ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నాం… బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని రాజకీయాలు చెయ్యొచ్చు…దేశంలో ప్రజలకు అన్నం పెడుతున్న రైతులు ఉద్యమాలు చెయ్యవద్దా? అని ప్రశ్నించారు. అంత పెద్దయెత్తున ప్రజల డబ్బు ఖర్చుపెట్టి బారికెడ్స్ ఏర్పాటు చేసి రైతు ఉద్యమాలను అణిచివేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బదులు ఒక మంత్రి నీ పంపి చర్చలు జరపవచ్చు కదా? అని ప్రశ్నించారు. వీటన్నిటికీ రైతులు, ప్రజలు రాబోయే కాలంలో బుద్దిచెబుతారని తెలిపారు.
Bomb Threats: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. అలర్టైన పోలీసులు