Leading News Portal in Telugu

DOP Senthil Kumar: బ్రేకింగ్.. ప్రముఖ డీవోపీ సెంథిల్ భార్య మృతి


DOP Senthil Kumar: బ్రేకింగ్..  ప్రముఖ డీవోపీ సెంథిల్ భార్య మృతి

DOP Senthil Kumar:ప్రముఖ డీవోపీ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే మృతిచెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ మరియు రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. COVID-19 నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పటినుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు, రూహీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమె ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలుపుతున్నారు. రూహీ మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంథిల్ కుమార్‌కు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.