Leading News Portal in Telugu

AP CEO MK Meena: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో ఎంకే మీనా సమావేశం


AP CEO MK Meena: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో ఎంకే మీనా సమావేశం

AP CEO MK Meena: రాజకీయ ప్రకటనల విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పని సరి అని సీఈవో రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీల ఆమోదం తప్పని సరి అని వెల్లడించారు. రాజకీయ ప్రకటనలు ప్రసారం చేసే తేదీకి కనీసం మూడు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందని.. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.