
Gulf Stream: భూమిపైన వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కాలుష్యం పెరగడంతో రుతువుల్లో మార్పులు, హిమానీనదాలు వేగం కరిగిపోతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం, ఇదే పరిస్థితులు కొనసాగితే 2025 నాటికి భూమి వాతావరణానికి కీలకమైన ‘‘ గల్ఫ్ స్ట్రీమ్’’ నాశనమవుతుందని, దీని వల్ల రానున్న కాలంలో ‘‘మినీ ఐజ్ ఏజ్’’ ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
గల్ఫ్ స్ట్రీమ్స్, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉద్భవించే శక్తివంతమైన సముద్ర ప్రవాహాలు. ఇవి ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలోని వాతావరణాన్ని నియంత్రిస్తుంటాయి. ముఖ్యంగా యూరప్, ఆసియా, ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంటాయి. వెచ్చని జలాలు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వేడిని రవాణా చేస్తాయి. గల్ఫ్ స్ట్రీమ్స్ దెబ్బతింటే తుఫానుల పెరుగుదల, వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ ఐరోపా వాతావరణాన్ని నియంత్రించడంలో గల్ఫ్ స్ట్రీమ్ కీలక పాత్ర పోషిస్తుంది, ఇక్కడ దాని వెచ్చని జలాలు మితమైన ఉష్ణోగ్రతలకు సహాయపడతాయి, ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణాన్ని నియంత్రిస్తుంటాయి. 2050లోగా కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే 2025-2095 మధ్య గల్ఫ్ స్ట్రీమ్ పతనం కావచ్చు.