Leading News Portal in Telugu

Hyderabad : 30వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతున్న ఆలయం..


Hyderabad : 30వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతున్న ఆలయం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువై ఉన్న మహిమన్విత అమ్మవారు పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది.. కాంగ్రెస్ మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పీజేఆర్ చిన్నగా ఉన్న ఆలయాన్ని పెద్ద ఆలయంగా మార్చారు.. ఈ నెల 14 నుంచి 17 వరకు రథోత్సవం జరుగుతుంది.. విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు.. నిన్నటి నుంచి ఈ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..


గురువారం మండల పూజలు, వేదపారాయణం, శుక్రవారం రథోత్సవం, శనివారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పుష్కరిణిలో స్నానంతో వార్షికోత్సవాలు ముగియనున్నాయి.. ఈ వార్షికోత్సవాలకు హంపీ పీఠాధిపతులు విద్యారణ్యస్వామి చేతుల మీదుగా విమాన శిఖర కుంభాభిషేకం నిర్వహిస్తారు.. కోరిన కోరికలు తీర్చే సత్యమైన తల్లిగా వరాలిచ్చే తల్లిగా పేరుపొందిన పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు..

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి రథోత్సవం జరగనుంది. అలాగే 17 వ తేదీన అమ్మవారికి అవభృథస్నానం చెయ్యనున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.. ఈ వార్షికోత్సవానికి భక్తులు భారీగా రానున్నట్లు సమాచారం.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.. మంగళవారం, శుక్రవారం, ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు..