
Pawan Kalyan Tour Cancelled: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధం అయ్యారు.. దాని కోసం హెలీకాప్టర్ సిద్ధం చేసింది జనసేన.. ప్రతీ జిల్లాలో మూడు సార్లు జనసేనాని పర్యటించేందుకు వీలుగా ప్లాన్ చేసినట్టు.. వార్తలు వచ్చాయి.. అయితే, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో జనసేన చీఫ్ పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటను రద్దు చేసుకున్నారు.. పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అవరోధాలు సృష్టించారని.. అందుకే పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయినట్టు జనసేన పార్టీ ప్రకటించింది.
భీమవరంలో చేసినట్లుగానే అమలాపురం, కాకినాడలోనూ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతులు ఇవ్వలేదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.. కాకినాడలో హెలీప్యాడ్ కోసం అనుమతి కోరితే.. 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి కలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని జనసేన నేతలు చెబుతున్నారు.. అయితే, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు జనసేనాని.. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వని కారణంగా పవన్ పర్యటన రద్దు కాగా.. షెడ్యూల్ ప్రకారం.. అక్కడి జరిగిన సమావేశాలను జనసేన కేంద్ర కార్యాలయంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.