Leading News Portal in Telugu

Pakistan Army: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రధాని పదవిని ఆఫర్ చేసిన పాక్ ఆర్మీ.. కానీ, కండిషన్స్ అప్లై



Pak

Pakistan: పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఒకవైపు నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ షెహబాజ్ షరీఫ్‌ను కుర్చీపై కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేసింది. కాగా, ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐ ఒమర్‌ అయూబ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఈసారి గుర్తు రాలేదు. దీని కారణంగా, అది స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. వారిలో 101 మంది గెలిచారు. కాగా, నవాజ్ షరీఫ్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఇక, పీపీపీ 54 సీట్లతో మూడో స్థానంలో ఉంది.

Read Also: Aadikeshava : బుల్లితెరపై అదరగొడుతున్న వైష్ణవ్ తేజ్ మూవీ..

అయితే, పాకిస్థాన్ ఆర్మీ అంగీకారంతో షెహబాజ్ షరీఫ్‌ను ప్రధాన మంత్రిని చేయాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. దీనికి నవాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. ఇందుకోసం పీఎంఎల్-ఎన్, పీపీపీ ఏకమవుతున్నాయి. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా తనదైన ఎత్తుగడలు వేస్తోంది. పాక్ సైన్యం ఇమ్రాన్ ఖాన్‌ను కూడా సంప్రదించింది అని పాకిస్తాన్ వార్తాపత్రిక ‘ది న్యూస్’ కథనం ప్రత్యక్ష ప్రసారం చేసింది. కాగా, మే 9న జరిగిన హింసకు క్షమాపణలు చెప్పాలనే షరతుపై ఆయనకు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేశారు. అంతే కాకుండా సైన్యంపై మళ్లీ ఎలాంటి సంఘటన జరగదని చెప్పినట్లు ఆ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.

Read Also: Bird Flu: నెల్లూరులో బర్డ్‌ఫ్లూ కలకలం.. చికెన్‌ విక్రయాలపై నిషేధం..

ఇక, ఇమ్రాన్ ఖాన్‌తో సైన్యం పరోక్షంగా చర్చలు జరిపినట్లు నాకు సమాచారం ఉంది.. ఇమ్రాన్ ఖాన్ కు సైన్యం పంపిన సందేశంలో.. మే 9 నాటి హింసకు కుట్ర పన్నినట్లు అంగీకరించాలని పేర్కొంది. దీనికి పాక్ ఆర్మీకి క్షమాపణలు చెప్పండి.. భవిష్యత్తులో అలా జరగదని వారు హామీ ఇచ్చారు.. కానీ, దీనికి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోలేదు.. దాంతో షెహబాజ్ షరీఫ్‌ను ప్రధాన మంత్రిని చేసేందుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ప్లాన్ చేస్తున్నాడు.