Leading News Portal in Telugu

Israel: పాలస్తీనాను దేశంగా అంగీకరించేది లేదు.. అమెరికా ప్రయత్నాలపై పీఎం నెతన్యాహూ..



Israel

Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.

Read Also: Baba Vanga: 2024లో నిజమవుతున్న బాబా వంగ జోస్యం..

ఇదిలా ఉంటే, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా అంగీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నెతన్యాహూ తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్ మిత్రదేశం అమెరికా, ఇజ్రాయిల్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో తెలియజేసింది. దీనిపై బెంజమిన్ నెతన్యాహూ శుక్రవారం స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనియన్లతో శాశ్వత పరిష్కారానికి సంబంధించి అంతర్జాతీయ ఆదేశాలను ఇజ్రాయిల్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి చెప్పారు.

పాలస్తీనా దేశం కోసం ఈజిప్టు, జోర్డాన్, యూఏఈ, ఖతార్, సౌదీ వంటి దేశాలతో అమెరికా కలిసి పనిచేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే, పాలస్తీనా దేశం ఇజ్రాయిల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ అన్నారు. గతం నుంచే ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రత్యేక దేశం, టూస్టేట్ ఫార్ములాను వ్యతిరేకిస్తోంది.