Leading News Portal in Telugu

Chandrababu: సమయం తక్కువగా ఉంది ప్రతీ ఒక్కరూ సీరియస్గా పని చేయాలి..



Tele Confarance

పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి బలోపేతానికి పనికి వస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. అలాంటి చేరికల్ని ప్రోత్సహించి కలిసి పని చేయాలని చెప్పారు.

Read Also: Venkataiah Goud: సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇస్తారు.. పలమనేరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మరోవైపు.. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడతానని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతీ ఒక్కరూ సీరియస్సుగా పని చేయాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందని.. ప్రతీ నియోజకవర్గంలోనూ బీసీ సాధికార సభలు నిర్వహించి తీరాలని చెప్పారు. జగన్ తమని మోసం చేశాడనే భావన ప్రతీ బీసీలోనూ ఉందని.. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన తెలుగుదేశంలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Vamsi Yadav: దమ్ముంటే నువ్వు గెలువు.. రాజకీయాలకు దూరంగా ఉంటా