Leading News Portal in Telugu

CM Revanth Reddy: తెలంగాణ పోలీసులను, డీజీపీ రవిగుప్తాను అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి



Telangana Police

CM Revanth Reddy: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీస్ ఓవరాల్ ఛాంపియన్ షిప్(చార్మినార్ ట్రోఫీ)ను సాధించిందని డీజీపీ రవి గుప్తా తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీని కైవసం చేసిందని డీజీపీ తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ ప్రతిభను కనబరిచి ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో ఓవరాల్ విన్నర్స్ ట్రోఫీతో పాటు ప్రొఫెషనల్ వీడియోగ్రఫీలో ఓవరాల్ రన్నర్స్ ట్రోఫీని గెలుచుకున్నారని డీజీపీ తెలియజేశారు.

Read Also: Telangana: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

విజేతలకు, తెలంగాణ పోలీసు శాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారని డీజీపీ అన్నారు. బంగారుపథకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి , డి.విజయ్ కుమార్, వి. కిరణ్ కుమార్, పి.అనంతరెడ్డి, ఎం. దేవేందర్ ప్రసాద్‌లు ఉన్నారని పేర్కొన్నారు. పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కే శ్రీనివాస్, షేక్ ఖాదర్ షరీఫ్ , సి. హెచ్ .సంతోష్, కే సతీష్‌లు వెండి పథకాలను గెలుచుకున్నారని డీజీపీ వివరించారు.