Leading News Portal in Telugu

Venkataiah Goud: సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇస్తారు.. పలమనేరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు



Mla Venkataiah Goud

పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇవ్వనున్నారని ప్రకటించారు. గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బు జీతంగా ఇవ్వకూడదని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ఈ 3 నెలలు ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతో జగన్ జీతం ఇస్తానని చెప్పారంటూ ఎమ్మెల్యే ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. అంతకుముందు కూడా కొన్ని సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.