
టీడీపీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు… వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
Vamsi Yadav: దమ్ముంటే నువ్వు గెలువు.. రాజకీయాలకు దూరంగా ఉంటా
చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావు.. ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారని తెలిపారు. బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా అని అన్నారు. కాగా.. జగన్ మోహన్ రెడ్డి పై బురద జల్లడానికే విధ్వంసం పుస్తకాన్ని తెచ్చారని విష్ణు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టే సత్తాలేక.. బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడని విమర్శించారు. విధ్వంసం పుస్తకం వెనుక చంద్రబాబు, పనన్, సీపీఐ రామకృష్ణ ఉన్నారని ఆరోపించారు.
Telangana: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
మూడు రాజధానులే తమ పార్టీ విధానమన్నారు. ఏపీలో పొత్తులు తేలాక ఎవరిపై ఎవరు రాళ్లు విసురుతారో… ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుందని అన్నారు. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది.. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీచేయాలనుకుంటున్నాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్ ది రెండు నాల్కల ధోరణి అని ఆరోపించారు. వాలంటీర్ల పై చంద్రబాబు, పవన్ ఏంమాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారని తెలిపారు.