Leading News Portal in Telugu

Rabri Devi: బీహార్ శాసనమండలిలో రబ్రీదేవికి ప్రమోషన్



Rabri

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నేత రబ్రీదేవికి (Rabri Devi) శాసనమండలిలో ప్రమోషన్ దొరికింది. తాజాగా ఆమె బీహార్ శాసనమండలికి ఆర్జేడీ విపక్ష నేతగాఎన్నికయ్యారు. ఇక రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా రబ్రీదేవి కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉన్నారు. ఇలా తల్లీకొడుకు లిద్దరూ అసెంబ్లీ, శాసనమండలిలో విపక్ష నేతలుగా ఉన్నారు.

పశుగ్రాసం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చోటుచేసుకోగానే ఆయన స్థానంలో 1997లో రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 1999 నుంచి 2000 వరకూ, తిరిగి 2000 నుంచి 2005 వరకూ ఆమె సీఎం పదవిలో కొనసాగారు. బీహార్ తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా ఆమెనే రికార్డ్ సృష్టించారు. 2022 అక్టోబర్‌లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో విపక్ష నేతగా కూడా రబ్రీ దేవి ఉన్నారు. తాజాగా మరోసారి ఆమె మండలిలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు.

ఇదిలా ఉంటే ఇటీవల నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలకు సంబంధించిన మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బలపరీక్షలో కూడా ఆయన 129 ఎమ్మెల్యేల మద్దతు విజయం సాధించారు. అలాగే ఇకపై ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రానని ప్రకటించారు.