Leading News Portal in Telugu

Bird Flu: నెల్లూరులో బర్డ్‌ఫ్లూ కలకలం.. చికెన్‌ విక్రయాలపై నిషేధం..



Bird Flu

Bird Flu: మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామంలోని రెండు కోళ్ల ఫారంలలో బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారించారు అధికారులు.. అంతే కాదు.. మూడు నెలలపై పాటు చికెన్‌ విక్రయాలపై నిషేధం విధించినిట్టు వెల్లడించారు.. చాటగొట్ల గ్రామంలోని రెండు కోళ్ల ఫారమ్‌లలో కోళ్లు చనిపోతుండడంతో శాంపిల్స్ సేకరించిన అధికారులు.. వాటిని భోపాల్‌కు పంపించారు.. అయితే, కోళ్లకు సోకింది బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ జరగడంతో అప్రమత్తం అయ్యారు.. మూడు నెలల పాటు చాటగొట్ల పరిసర ప్రాంతాల్లో చికెన్ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.. చాటగొట్లకు 10 కిలో మీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు అధికారులు.. ఇక, సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.

Read Also: Coach Jai Simha: నేను మద్యం సేవించలేదు.. కూల్ డ్రింక్ మాత్రమే తాగాను: కోచ్ జై సింహా

చాటగొట్లలో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాతపడినట్టు చెబుతున్నారు.. దీంతో, జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి.. ఇక, తాజాగా అది బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ కావడంతో.. గ్రామస్తులు వణికిపోతున్నారు. అయితే, బర్డ్ ఫ్లూ వ్యాప్తిచెందకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్.. పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. బయట వ్యక్తులు రావొద్దని తెలిపారు.. ముఖ్యంగా చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు అధికారులు. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడి నెల్లూరు జిల్లా సమర్థక శాఖ సహాయ సంచాలకులు చైతన్య కిషోర్.. బర్ద్ ఫ్లూతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. చాట గొట్ల.. గుమ్మల్ల దిబ్బ గ్రామాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు.. దేశంలో మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు చైతన్య కిషోర్.