Leading News Portal in Telugu

YSRCP Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!



Ysrcp Rebel Mlas

YSRCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. దీనికోసం మరోసారి రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.. వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే ఇప్పటి వరకు తాను విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు స్పీకర్‌.. దీంతో, తుది విచారణకు హాజరు కావాలా..? వద్దా..? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో పడిపోయారట వైసీపీ రెబెల్స్.. మరోవైపు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద రాజుకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

Read Also: Saturday Special: ఈ రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అప్పులన్నీ తొలగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు

కాగా, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది ఉత్కంఠ రేపుతోంది.. ఇప్పటికే పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. కొన్నిసార్లు విచారణకు డుమ్మాకొట్టారు రెబల్స్‌.. మరికొన్నిసార్లు విచారణకు రాలేకపోతున్నామంటూ సమాచారం ఇచ్చారు.. తాము వివరణ ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరారు. మొత్తంగా రాజ్యసభ ఎన్నికల వేళ.. రెబల్‌ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా సాగుతోంది.